యూత్ ప్రేక్షకుల ‘హార్ట్ ఎటాక్’

Heart-attack-movie-review

నితిన్ హీరోగా.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హార్ట్ ఎటాక్’. వరుసగా రెండు విజయాల తర్వాత హైట్రిక్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, సరైన విజయాన్ని అందుకోలేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ్ ఈ సారి ‘హార్ట్ ఎటాక్’తో యూత్ ని ఆకట్టుకున్నా… మాస్ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేక పోయారు. పూరీ జగన్నాథ్ ఈ సినిమా ‘ఇడియట్’ లాగా ఉంటుందని చెప్పడంతో ప్రేక్షకులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇడియట్ సినిమాకి తగ్గట్టే ఉన్నప్పటికీ, ఇడియట్ తరహాలో మాస్ ఎలిమెంట్స్ లేవు. ఇడియట్ సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్, నటన మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కానీ నితిన్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకునే విధంగా లేవు. యూత్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ ఈ చిత్రంలో పెద్దగా హాస్యాన్ని పండించలేకపోయారు. మొత్తంగా ‘హార్ట్ ఎటాక్’ యూత్ ప్రేక్షకులకు సూపర్ హిట్, మాస్,ఫ్యామిలీ ఆడియన్స్ కి చూడదగ్గ చిత్రం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.