రఘునాథపల్లిలో దోపిడీ దొంగల భీభత్సం : ఇద్దరి మృతి

రఘనాథపల్లి, సెప్టెంబర్ 12: వరంగల్ జిల్లా రఘనాథపల్లి గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మండల కేంద్రమైన రఘనాథపల్లిలోని ఓ ఇంట్లో గురువారం అర్థరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.  ఈ ఘటనలో దొంగలు మారణాయుధాలతో దాడిచేయడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బూడిద లక్ష్మీ(60), బాలిక అఖిలనందిని(9). తీవ్రంగా గాయపడ్డ రాధమ్మ(80), హంసవర్ధన్ (5) లను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.