రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: నలుగురు సజీవ దహనం

హైదరాబాద్: గగన్ పహాడ్ లోని రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు యజమాని అంగీకరించడంతో మృతుల కుటుంబీకులు కార్మిక సంఘాలతో కలిసి చేస్తున్న తమ ఆందోళనను విరమించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.