రవితేజతో తమన్నా రొమాన్స్

ravi-teja-tamanna

ప్రస్తుతం మహేష్ బాబుతో ‘ఆగడు’ సినిమా చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా, త్వరలో రవితేజ సరసన జతకట్టనుంది. సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్లో గతంలో వచ్చిన హిట్ చిత్రం ‘కిక్’కి ఇప్పుడు సీక్వెల్ నిర్మించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో రవితేజ పక్కన కథానాయికగా తమన్నాను తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘రేసుగుర్రం’ చిత్రాన్ని తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీని తర్వాత ఆయన ‘కిక్ 2’ చేస్తాడు. హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.