రసాభాసగా మారిన సర్వసభ్య సమావేశం

ఖమ్మం, సెప్టెంబర్ 29: ఖమ్మం జిల్లా పరిషత్ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఎన్నిక అనంతరం తొలిసారిగా స్థాయి సంఘాల సభ్యుల ఎన్నిక కోసం సోమవారం జరిగిన సమావేశం రాజకీయ వేదికగా మారింది. టీడీపి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాగ్వివాదానికి దిగారు. నేతలు పార్టీలు మారటంపై ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. సమావేశం ప్రారంభంలో టిడిపి ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పదవులు పొంది పార్టీలు మారిన వారు వెంటనే రాజీనామా చేయాలని పోట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరించామని అవసరమైతే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ చెప్పారు. ఈ వేదికపై ప్రజా సమస్యలను మాత్రమే చర్చించాలని ఛైర్ పర్సన్ కవిత కోరడంతో పోట్ల నాగేశ్వరరావు, కవితల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య జోక్యం చేసుకొని దీన్ని రాజకీయ వేదికగా మార్చకుండా జిల్లా సమస్యలపై చర్చించాలని పట్టుబడటంతో వివాదం ముగిసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.