రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: దగ్గుబాటి

Daggubati-venkateshwar-rao

ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త అన్న సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు దగ్గుబాటి ప్రకాశం జిల్లా కారంచేడులో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు దగ్గుబాటి ప్రకటించారు. మరో వైపు ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో ‘కమల తీర్థం’పుచ్చుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.