రాజకీయ ప్రత్యామ్నాయ సదస్సు భగ్నం

రాజకీయ ప్రత్యామ్నాయ సదస్సు భగ్నం

హైదరాబాద్ : రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సభ్యుడు, విరసం నాయకుడు వరవర రావును, ఇతర సభ్యులను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు నిర్భందంలోకి తీసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న వారిని ట్యాంక్ బండ్ పై అరెస్టు చేశారు.

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నక్సల్స్ నియంత్రబడిన ప్రాంతాల్లో జనతా సర్కార్ పేరిట మవోయిస్టులు నడుపుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేసిన కారణంగానే ముందస్తుగా వరవర రావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞన కేంద్రం వద్ద ఆదివారం సదస్సును నిర్వహించాలని ప్రణాళిక చేశారు. కాని దీనికి పోలీసుల అనుమతిని ఇవ్వడానికి నిరాకరించారు. అదే విధంగా జిల్లాల నుండి నగరానికి చేరే కార్యకర్తలను మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది ప్రముఖ నాయకులను శనివారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసినవారందరిని విడుదలచేసి సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అనుమతిని ఇవ్వాలని చుక్కా రామయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రోఫెసర్ హరగోపాల్ నగర పోలీసు కమీషర్ మహీందర్ రెడ్డిని కోరారు. అరెస్ట్ అయినవారంది విడుదలకు కమీషనర్ అంగీకరించారు. కాని సమావేశం నిర్వహించుకోవాడానికి అనుమతి నిరాకరించారు.

ర్యాలీ, సదస్సు నిర్వహించడానికి అనుమతి కోరుతూ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సభ్యులు నాలుగు రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకన్నప్పటికి, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని అనుమతి నిరాకరిస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ డిసిపి కమలాసన్ రెడ్డి ప్రకటించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు నడుపుతున్న ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నిషేదం ఉంది కాబట్టి సదస్సు ను ఇక్కడ నిర్వహించడానికి అమతిలేదని డిసిపి స్పష్టం చేశాయి. మావోయిస్టులకు అనుబంధగా నడుస్తున్న ఆర్.వై.ఎల్ (రాడికల్ యూత్ లీగ్), ఆర్.సి.ఎస్ (రైతు కూలీ సంఘం), ఆర్.ఎస్.యు (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్), సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ వర్కర్స్ ఫెడరేషన్, ఏ.ఐ.ఆర్.ఎస్.ఎఫ్.ఐ (ఆల్ ఇండియా రివల్యూషనరి స్టూడెంట్స్ ఫెడరేషన్) లను తెలంగాణ ప్రభుత్వం నిషేదించిందని డిసిపి కలమలాసన్ రెడ్డి ప్రోఫెసర్ హరగోపాల్ తదితరులకు తెలిపారు. అనంతరం ఫ్రొఫెసర్ హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ వరవర రావు, కమిటి సభ్యుల పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. నిర్భంధాలతో హింస పెరుగుతుందే తప్ప తగ్గదనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని పేర్కొన్నారు. సమావేశం నిర్వహించడానికి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు.

అరెస్ట్ అయిన వారందరిని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.