రాజస్థాన్ జైల్లో ఒక ఖైదీపై మరో ఖైదీ కాల్పులు

Rajasthan-jail

మన దేశంలోని జైళ్ల నిర్వహణపై సందేహాలు లేవనెత్తిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ లే నిషిద్ధమైన జైల్లో తుపాకులు పేలాయి. రాజస్థాన్ లోని సికార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఓ ఖైదీపై మరో ఖైదీ కాల్పులకు తెగబడ్డాడు. మధ్యాహ్నభోజన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, గాయపడ్డ ఖైదీ పరిస్థితి విషమంగా ఉందని జైలు అధికారులు తెలిపారు. అతనిని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నామని వారు స్పష్టం చేశారు. నిందితుడు కాల్పులకు ఉపయోగించిన పిస్టల్, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. ఈ ఇద్దరు ఖైదీలు వేర్వేరు కేసుల్లో ముద్దాయిలని జైలు అధికారులు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.