రాజు రవితేజపై పవన్ కి ఎందుకంత నమ్మకం

raju-raviteja

పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టిన రోజు నుండి అందరి నోట రాజు రవితేజ అనే పేరు వినిపిస్తుంది. అసలు ఎవరీ రాజు రవితేజ… పవన్ కళ్యాణ్ కి ఎన్నో పరిచయాలు, ఎంతో మంది సలహాదారులు ఉండగా రాజు రవితేజనే ఎంచుకోవడానికి కారణమేమిటి.. రాజు రవితేజ సాంస్కృతిక అవగాహన మరియు సమర్ధత కలిగిన వ్యక్తి. రాజు రవితేజ సాంస్కృతిక అవగాహన సంబంధించిన టీచింగ్ క్లాసులు చెప్పడమే కాక, చిన్న పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు మరియు యువకుల జీవిత చరిత్రలు కూడా రాసేవాడు. తను తత్వశాస్త్రం (ఫిలాసఫి) మీద కూడా మంచి పట్టున్న వ్యక్తి. సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి.

16 ఏళ్ల వయసులోనే ఓ ఫంక్షన్ హాల్ లో వెయిటర్ గా పనికి కుదిరాడు. ఆ తర్వాత చదువుకుంటూనే ఆఫీస్ బాయ్ గా, కంప్యూటర్ ప్రొగ్రామర్ గా మరియు సేల్స్ మెన్ గా బ్రతుకుదెరువు కోసం ఎన్నో పనుల్లో కుదిరాడు. 1994 లో యురిక్సో అనే కన్సల్టెన్సీ స్థాపనతో రాజు రవితేజ జీవితం మారిపోయింది. అప్పటినుండి తనలోని శక్తి సామర్థ్యాలకు పదును పెట్టుకుంటూ ఎంతో మందికి మార్గదర్శకుడిగా మారాడు. ఎన్నో అంశాలపై అనర్గళంగా మాట్లాడగలిగే పట్టున్న రవితేజ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల సంస్థలకు వ్యక్తిగత ట్రైనర్ గా వ్యవహరిస్తున్నారు. న్యూఢిల్లీలో బ్రిటీష్ హైకమీషన్, సత్యం కంప్యూటర్స్, నోకియా సంస్థలు రాజు రవితేజ సేవలను వినియోగించుకున్నాయి.

2002లో ఇన్స్ పైర్ ఇండియా అనే సామాజిక స్వచ్చంద సంస్థను  స్థాపించి యువకులను ప్రభావితం చేస్తున్నారు. ఆలోచన, పరిశీలన, అనుభవం మూలసూత్రాలుగా తన ఫిలాసఫీని నిర్మించుకున్న రాజు రవితేజకు సమాజం, రాజకీయాలు, యువ చైతన్యం అంశాలపై నిర్థిష్ట సూత్రాలు ఉన్నాయి. ఈ ఆలోచనా దోరణే పవన్ కు రవితేజను దగ్గర చేసింది. ఐదేళ్లుగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పవన్ మరియు రవితేజ చర్చించుకుంటూనే ఉన్నారు. సమాజంలో మార్పు తేవాలంటే ప్రశ్నించే పార్టీ ఒకటి ఆవిర్భవించాలన్న ఉద్దేశ్యంతో పవన్, రాజు రవితేజ జనసేన పార్టీని నిర్మించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.