రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల గెలుపు

Rajya-sabha-elections

రాజ్యసభ ఎన్నికల్లో అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. బరిలో నిలిచిన ఆరుగురు అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్ లు గెలుపొందగా టీడీపీ నుంచి గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 248 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎం.ఎ.ఖాన్ కు 49 ఓట్లు, కెవిపికి 46, టి.సుబ్బిరామిరెడ్డికి 46, గరికపాటి మోహన్ రావుకు సీతారామలక్ష్మికి 38 చొప్పున ఓట్లు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కే. కేశవరాపుకు 26 ఓట్లు మాత్రమే లభించాయి. ఆయన రెండవ ప్రాధాన్యతా ఓట్లతో గెలుపొందారు.దీంతో రాజ్యసభలో తొలిసారిగా టీఆర్ఎస్ అడుగుపెట్టగలిగింది. ఇది తెలంగాణ ప్రజల విజయమని కేకే అన్నారు. ఆయన విజయం సాధించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఆ పార్టీ నాయకులు ఎంపీలు అభినందించారు. సంభ్రమాశ్యార్యానికి గురైన టీడీపీ నేత ఎమ్మెల్యే దయాకర్ రావు, గరికిపాటి మోహన్ రావుకు ముద్దుపెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం టీడీపీ నేతలు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఓటు వేసిన సభ్యులకు గరికపాటి, సీతారామలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ తిరుగుబాటు అభ్యర్థులను ఉపసంహరించుకునేటట్టు చేయడం కృతకృత్యులుకావడంతో అధికార అభ్యర్థుల గెలుపు సుగమమైంది. చెల్లనివి 4 ఓట్లు కాగా దగ్గబాటి వెంకటేశ్వర రావు తిరస్కరణ ఓటు వేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.