రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటువేసిన దగ్గుబాటి

Daggubati-venkateshwarlu

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలనానికి తెర తీశారు. ఈ ఎన్నికల్లో మొదటి సారి ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటును ఆయన వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థీ నచ్చకపోతే ఎవరూ నచ్చలేదంటూ తిరస్కరణ ఓటు వేయవచ్చు. ఓటు వేయడానికి వెళ్తున్న సమయంలోనే, తనకు ఏ అభ్యర్థికీ ఓటు వేయాలని అనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం తిరస్కరణ ఓటు వేసి వచ్చారు.

కాగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పే రాజ్యసభ ఎన్నికల్లో తాను తిరస్కరణ ఓటు వేశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. సీమాంధ్ర నేతల, ప్రజల మనోభావాలకు గౌరవం లేకుండా యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లుపై నిర్ణయం తీసుకుందని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఒత్తిడి తెచ్చిన వాళ్లే రాజ్యసభ అభ్యర్థులుగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం దగ్గుబాటి తిరస్కరణ ఓటు విషయం చర్చనీయాంశంగా మారింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.