రాజ్యసభ బరిలో నేనూ ఉన్నా: జేసీ

JC-Diwakar-reddy

రాజ్యసభ ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు రేపుతూనే ఉన్నాయి. రాజ్యసభకు నేనంటే నేనని నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నేనూ రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నానని’ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి గంటా సహా అందరి మద్దతు అడుగుతున్నానని చెప్పారు. సమైక్యాంధ్ర ఎజెండా పైనే తాను ఎన్నికల్లో దిగుతున్నానని జేసీ అన్నారు. తనకు ఓటు వేస్తే ఓల్వో బస్సు ఆఫర్ చేస్తానని జేసి అన్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడంతో దానికి జేసీ మాట్లాడుతూ… నేనేమీ అలా అనలేదని నాకు ఓటు వెయ్యమని నేను అడగగా వారే ఓల్వో బస్సు ఇస్తే వేస్తామని అన్నారని దానికి నేను సరదాగా తప్పకుండా ఓటుకో ఓల్వో బస్సు ఇస్తానని చెప్పానన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.