రాజ్ నాథ్ సింగ్ తో కేసీఆర్ భేటీ

KCR Meet Rajnath Singh

బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ సభ్యుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని కేసీఆర్ రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. గతంలో తమ పార్టీ చెప్పిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. కాగా బాబుకు ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి, తనను నిర్లక్ష్యం చేయడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.