రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి

హైదరాబాద్‌:  ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం బాహుబలి. శుక్రవారం నుంచి రామోజీఫిల్మ్ సిటీలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రభాస్ పై పాటను చిత్రీకరిస్తున్నారు. మరో 10 రోజుల పాటు చిత్రీకరణ కొనసాగుతుంది. ఇటీవల చిత్రబృందం మహాబలేశ్వరం పూర్తి చేసుకొంది అక్కడి చిత్రీకరణ గురించి చిత్ర బృందం కథలు కథలుగా చెప్పుకుంటోంది.. ఈ చిత్రానికి సంగీతం యం.యం.కీరవాణి. కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.