రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం..?

Governor-rule-in-andhra

సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి స్థానంలో కొత్త వారిని నియమించాలా? లేక రాష్టపతి పాలన విధించాలా? అనే విషయంలో తర్జనభర్జన పడుతోంది. సాయంత్రంలోగా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సభలో సభ్యుల బలం చూసుకుని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.