రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ 10 వేల కోట్లు

pvexpress highway1హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతుంది. రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు రూ. వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ.10 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దీనికి సంబంధించిన నిధులను ఈ బడ్జెట్ లోనే కేటాయించనున్నారు. 15 రోజుల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్లను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో హైదరాబాద్ నగరంలో మరో నాలుగు హైవేలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. అదేవిధంగా వరంగల్, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు వెళ్లే రహదారులను కలుపుతూ నాలుగు ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మించనుంది.

రాష్ట్రంలోని రోడ్ల అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతన ఉపసంఘం పని చేయనుంది. నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్‌రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, కేటీఆర్ లు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.