రాష్ట్ర రాజధానుల అభివృద్ధే లక్ష్యం : వెంకయ్యనాయుడు

విజయవాడ: అన్ని రాష్ట్రాల రాజధానులు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాడు అన్నారు. సోమవారం విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన స్మార్ట్ సిటీలపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని నగరం స్మార్ట్ సిటీ అవుతుందని ఆయన తెలిపారు. వాటిలో నిరంతర మంచినీరు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్య,  వైద్యసదుపాయాలు తగిన రీతిలో కల్పించాల్సి ఉందన్నారు. సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కవ మంది ప్రజలు నివసిస్తుంటే మన దేశంలో మాత్రం పట్టణ జనాభా 32 శాతమేనని ఆయన చెప్పారు. గ్రామాల నుంచి పట్టణాల్లో నివసించేందుకు వచ్చేవారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ అంశాలన్నీ స్మార్ట్సిటీలో భాగమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతోనే అవి సాకారమవుతాయని వెంకయ్యనాయుడు అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.