రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నా

rahul gandhi dharna-2

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ధర్నాలో పాల్గొన్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 2 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ హామీలను నెరవేర్చడంలో ఎన్డీఎ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావడం మొదలు పలు హామీల నుంచి మోదీ ప్రభుత్వం వెనక్కి వెళ్లిందని ఆరోపిస్తూ వెలువరించిన చిన్న పుస్తకాన్ని రాహుల్ ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంట్ లో ఎండగడతామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.