రిలయన్స్ ని టార్గెట్ చేసిన కేజ్రీవాల్

kejriwal-mukesh-ambani

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని టార్గెట్ చేశారు. రిలయన్స్ కంపెనీపై ఢిల్లీ ప్రభుత్వోద్యోగులు తనకు ఫిర్యాదు చేశారని, ఈ క్రమంలో ముఖేష్ అంబానీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, ఎంపీ మురళీ దేవరా, ఇతరులపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ ఏసీబీని ఆదేశించినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఏసీబీ ఆ పనిలోనే ఉందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేజ్రీవాల్ ఈ కేసులో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రధానమంత్రికి, మొయిలీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. రిలయన్స్ కు కేటాయించిన గ్యాస్ బావులను వెనక్కి తీసుకోవాలని కోరనున్నట్లు వివరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.