రీ షూట్ లో ‘కొత్త జంట’ మూవీ

kotha-janta-movie-wallpapers

చిన్న సినిమాల దర్శకుడు మారుతీ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కొత్త జంట’. అయితే ఈ చిత్రం రీ షూట్ లో ఉన్నట్లు సమాచారం.
దర్శకుడు మారుతి తన గత చిత్రాల ట్రెండులోనే దీనిని కూడా తీసేయడంతో, నిర్మాత అల్లు అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశాడని ప్రచారం జరుగుతోంది.
దాంతో కొన్ని సీన్ లను మళ్లీ రీ షూట్ చేస్తున్నారట. మారుతీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉండటం సహజం. అయితే డబుల్ మీనింగ్ డైలాగులు వంటివి తీసేయమని అరవింద్ ఆదేశించినట్టు చెబుతున్నారు. తన తనయుడు శిరీష్ నటిస్తున్న సినిమా కాబట్టి ఇది క్లీన్ గా వుండాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. అందుకే రీ షూట్ చోటు చేసుకుందట! ఇందులో శిరీష్ సరసన రెజీనా కథానాయికగా చేస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.