రుణమాఫీని అమలు చేస్తాం : మంత్రి పోచారం

హైదరాబాద్, సెప్టెంబర్ 20 : తెలంగాణలోని వ్యవసాయ రుణమాఫీ నూటికి నూరు శాతం చేసి తీరుతామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలపారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. భూమి లేకున్నా కొందరు నకిలీ పాస్ బుక్‌లతో రుణాలు తీసుకున్నారని తమ విచారణలో తేలిందని చెప్పారు. ఏడు శాతం వడ్డీతో బంగారంపై పంట రుణాలను తీసుకుంటే వాటిని కూడా మాఫీ చేయనున్నట్లు పోచారం తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.