రుణమాఫీపై చర్యలు చేపట్టిన ఎపి ప్రభుత్వం

babu-upa-sangham-29 file photo

(పాత చిత్రం)

హైదరాబాద్, డిసెంబర్ 2 : రైతుల రుణమాఫీపై మంత్రులు, పార్టీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం భేటీ అయ్యారు. డ్వాక్రా రుణాలను ఒకేసారి పూర్తిచేయాలని సమావేశలో నేతలందరూ అభిప్రాయానికి వచ్చారు. రుణమాఫీ ఖాతాలను 42 లక్షలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది. ఉద్యానవన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల ఐదో తేదీ లోపల 20 శాతం నిధులను రైతుల బ్యాంకుల్లో జమచేయనున్నారు. మిగిలిన రుణాలకు బ్యాండ్లు జారీ చేయాలని నిర్ణయించారు.50 వేల రూపాయల రుణం తీసుకొన్నవారిని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మిగిలిన రుణాలకు బ్యాండ్లు ఇవ్వనున్నారు.ఈ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.