రూపాయి పతనానికి కారణం ప్రభుత్వ నిర్ణయాలే

రూపాయి పతనానికి కారణం ప్రభుత్వ నిర్ణయాలే

న్యూఢిల్లీ : రూపాయి విలువ రికార్డు స్థాయికి దిగజారిన తర్వాత ఆర్ధిక మంత్రి చిదంబరం నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. 2008 ఆర్ధిక సంక్షోభంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలే నేడు రూపాయి పతనానికి కారణమయ్యాయని ఆయన చెప్పారు. అప్పటి ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలే ఆర్ధిక వ్యవస్థకు తర్వాత గుదిబండలయ్యాయి. అప్పటి ఆ నిర్ణయాల వల్ల ఆర్ధిక రంగాన్ని చక్కదిద్ది, అభివృద్ధి దెబ్బతినకుండా చూశామని, కాని ఆ చర్యల వల్ల నేడు రూపాయి విలువ పడిపోయే పరిస్థతి తప్పలేదని చెప్పారు. ఆహారభద్రత బిల్లు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం వేయదని ఆయన హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.