రెండు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి

హైదరాబాద్, అక్టోబర్ 5: సికింద్రాబాద్‌ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌ జలవిహార్‌లో `అలయ్‌ బలయ్‌` కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, పలువురు ప్రజా పతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమన్నారు. గత పది సంవత్సరాలుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం, ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

bandaruపార్టీలు, రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం సంతోషకరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దత్తాత్రేయను ఆయన అభినందించారు.

భాష, దేశం ప్రాంతం మన అనుబంధాన్ని పెంచుతాయని అన్నారు. ఐకమత్యం లేకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయామే తప్ప, తెలుగు వారందరూ ఎప్పుడూ ఒకటిగానే ఉండామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఎంతో కృషి జరుగుతుందని సికింద్రబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంతులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి, భారతీయజనతా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.