రెండో వన్డేలో భారత్ ఘనవిజయం

హైదరాబాద్, నవంబర్ 6: అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఆరువికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 79, అంబటి రాయుడు 121, కోహ్లీ 49 పరుగులతో ఈ ఘనవిజయాన్ని సాధించారు. భారత్ 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 275 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. రాయుడు 118 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ లతో 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐదు వన్డేల సీరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. శ్రీలంక బౌలర్లలో ప్రసన్న 3 వికెట్లు, ప్రసాద్ ఒక వికెట్ తీశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.