రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతి

supre court 1హైదరాబాద్, అక్టోబర్ 27: ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఊరట లభించింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వెంటనే షెడ్యూల్ తయారుచేసుకోవచ్చని చెప్పింది. నవంబర్ 14 వ తేదీలోపు కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. అయితే షరతులకు లోబడే నిర్వహించాలని, కళాశాలల బోధనా ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఎంసెట్ కౌన్సిలింగ్ పై రెండు రాష్ట్రాల వివాదాల నేపథ్యంలో తొలి విడుత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసింది. మొదటి విడుత కౌన్సిలింగ్ ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ లో 60 వేలు, తెలంగాణలో 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఇటు బోధనా ప్రమణాలను సరిగా లేవని తెలంగాణ ప్రభుత్వం 174 కాలేజీలను అనుమతిని నిరాకరించడంతో ఎంసెట్ కౌన్సిలింగ్ లో పాల్గొనలేదు. అసంపూర్తిగా మారిన ఎంసెట్ కౌన్సిలింగ్ రెండో విడుత నిర్వహించడానికి అనుమతిని ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సెప్టెంబర్ 10న  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో చాలా మంది విద్యార్ధులు కౌన్సిలింగ్ కు హాజరు కాలేదని, మరోసారి కౌన్సిలింగుకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండో విడుత కౌన్సిలింగ్ కు అనుమతిని ఇచ్చింది. మిగిలి ఉన్న 240 రోజుల్లో సిలబస్ మొత్తం పూర్తిచేసి విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామనే షెడ్యూల్ ను కూడా వెంటనే సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే కేసు పూర్తి విచారణను రేపటి వాయిదా వేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.