రేప్ డ్రగ్ విక్రయంపై కేంద్రం ఆంక్షలు

Rape-Drug

రేప్ డ్రగ్ గా పేర్కొనే కెటమైన్ అనే అనెస్థీయా ఔషధ విక్రయాన్ని కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. దుర్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. ఈ ఔషధాన్ని ఎక్స్ (కఠిన షెడ్యూల్) విభాగంలోకి మార్చింది. దీంతో ఇకపై కెమిస్టులు ఈ ఔషధ విక్రయానికి సంబంధించి పక్కాగా రికార్డులు నిర్వహించాలి. దీన్ని వాడితే ఉల్లాసంగా ఉంటుంది. పౌడర్, లిక్విడ్ రెండు రూపాల్లోనూ ఇది లభ్యమవుతుంది. ఎక్కువగా వాడితే గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల హెచ్చరిక. ఈ ఔషధాన్ని శృంగార వాంఛల కోసం కూడా వినియోగిస్తుంటారు. అత్యాచారాలకు కూడా ఇది కారణమవుతుందని చెబుతారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.