రైతు ఆత్మహత్యలపై ఇందిరాపార్క్ వద్ద టిడిపి ధర్నా

హైదరాబాద్, నవంబర్ 18: రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద టిడిపి నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి, గరికపాటి, రేవంత్ రెడ్డి తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వీరితోపాటు ఆత్మహత్యలు చేసుకున్న రైతు బాధిత కుటుంబాల వారు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడంవల్ల రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకే వరకే కాకుండా, అప్పులున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటంచేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.