రైతు ఆత్మహత్యలు సమాజానికి సిగ్గుచేటు : కోదండరాం

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అందరిపైన ఉందని తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరాం అన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న రైతు ఆత్మహత్యలు మొత్తం సమాజానికి సిగ్గుచేటు. వాటిని నివారించాల్సిన బాధ్యత అందరిమీద ఉంది. సమిష్టిగా ప్రయత్నం చేద్దాం. వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాలు లేకపోవడం, విపరీతంగా రుణభారం పెరగడంతో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు అప్పులు చేసి బావులు తవ్వుకున్నారని, అప్పుచేసినా బావుల్లో నీళ్లు లేకపోవడంతో తీసుకున్న అప్పుల రుణ భారం పెరగడంతో అవి తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోదండరాం తెలిపారు. అదే విధంగా రైతుల పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.