రైతు రుణమాఫీపై ఏపీ సీఎం విధాన ప్రకటన

chandra babu-04

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రైతు రుణమాఫీ విధానాన్ని ప్రకటించారు. కుటుంబానికి రూ 1.50 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. ఆధార్, రేషన్, ఓటర్ ఐడెంటిటీ కార్డు వంటి పత్రాలన్నీ సక్రమంగా ఉన్నవారికి వెంటనే రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ఈనెల 9 వ తేదీ లోపల 50 వేల రూపాయల లోపు రుణాలను ఒకే సారి మాఫీ చేస్తామని ఆయన తెలిపారు. తక్కిన రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.

2007 ఏప్రిల్ 1 నుంచి 2013 డిసెంబర్ 31 వ తేదీ వరకూ తీసుకొన్న రుణాలను మాఫీ చేస్తామని ఆయన అన్నారు. బ్యాంకర్లు కోరిన ప్రతాలను రైతులు అందజేయాలని ఆయన కోరారు. పత్రాలు లేని వారికి నాలుగువారాల గడువు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  గ్రామ సభల్లో రుణమాఫీ దారుల జాబితా చదివి వినిపిస్తారని ఆయన చెప్పారు. డ్వాక్రా సభ్యులకు 10 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ రుణాలన్నిటీని మాపీ  చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని. కానీ ఇప్పుడు  ప్లేటు మార్చి కేవలం పంట రుణాలనే మాఫీ చేస్తామని అంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ ఆరోపించారు. డ్వాక్రా రుణాలపై ముఖ్యమంత్రికి స్పష్టత లేదని ఆయన చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.