రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : హరీష్ రావు

harish rao1-24

టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని భారీ నీటిపారుదలశాక మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతోన్న రైతుల ఆత్మహత్యలు కనిపిస్తాయిగానీ ఆంధ్రాప్రాంతంల్లో జరుగుతోన్న రైతు ఆత్మహత్యలు తెలుగుదేశం నేతలకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనంతపురంలో 59 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అక్కడి ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. రైతుల మీద మీ ప్రేమ నిజమైతే, అనంతపురం రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదన్నారు. తెలంగాణలో చేసినట్టు తెలంగాణ తెదేపా నేతలు అనంతపురంలో కూడా బస్సుయాత్రలు చేయాలని, లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసమే బస్సు యాత్రలు చేశారని తెలంగాణ ప్రజలు భావించాల్సి ఉంటుందని హరీష్ రావు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడం వల్లే అనంతరపురంలో రైతులు ఆత్మహత్యలు చేసకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు మాని ఇరు రాష్ట్రాల్లోని రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేద్దామని హరీష్ రావు కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.