రైతు సాధికార కార్పొరేషన్ కు 5 వేల కోట్లు

హైదరాబాద్, అక్టోబర్ 4: రైతు రుణ మాఫీ కోసం రైతు సాధికార కార్పొరేసన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సాధికార కార్పొరేషన్ విధివిధానాలను ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తొలివిడుతగా 5 వేల కోట్ల రూపాయల నిధును ప్రభుత్వం కేటాయించింది. అంతే కాకుండా 10 లక్షల విలువ గల షేర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ కార్పొరేషన్ ఈ నెల 22 నుండి అమల్లోకి రానున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.