రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం

badri-8

కాళ్ల వీరభద్రరావు (బద్రి) పాత చిత్రం

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ 9 న్యూస్ రీడర్ బద్రి (39) మృతి చెందాడు. ఈ దుర్ఘటన ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద రాష్ట్ర రహదారిపై జరిగింది. ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన తన బంధువుల వివాహానికి బద్రీ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. అనంతరం వారు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని అత్తవారి ఊరు నల్లచర్ల మండలం ఆవుపాడుకు బద్రీ కుటుంబ సభ్యులతో బయల్దేరారు. మార్గ మధ్యలో బద్రీ ప్రయాణిస్తున్న కారు లక్ష్మీనగర్ సమీపంలో టైరు పంచరు కావడంతో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొనడంతో బద్రీ అక్కడికక్కడే మృతి చెందారు. బద్రి పూర్తి పేరు కాళ్ల వీరభద్రరావు. ఈ ప్రమాదంలో బద్రి భార్య లక్ష్మీ సుజాత, కుమారులు సాయి సందీప్, సాయి సాత్విక్, బద్రి బంధువు తారక్ కు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారిని ఏలూరు ప్రైవేటు అసుపత్రికి తరలించారు. బద్రి చిన్నకుమారుడు సాయి సాత్విక్ (8) చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.