రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మృతి

నల్లొండ, డిసెంబర్ 6: నల్లొండ జిల్లా, మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ దుర్మరణం పాలయ్యారు. జానకి రామ్ తాను స్వయంగా టాటా సఫారీ కారు (ఏపీ 29 బీడీ 2323) నడుపుకుంటూ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కోదాడ దాటిన తర్వాత కారు ఆకుపాముల వద్దకు చేరుకోగానే వరి నారు లోడుతో రాంగ్ రూట్ లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన జానకీరామ్ ను కోదాడ పట్టణంలోని తిరుమల ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.