లబ్దిదారులు సద్వినియోగం చేసుకోండి

లబ్దిదారులు సద్వినియోగం చేసుకోండి

ఖమ్మం, సెప్టెంబర్, 24: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని లబ్దిదారులకు ఒకేసారి (ఒన్ టైమ్ సెటిల్మెంట్) పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్లు జనరల్ మేనేజర్ మురళీ తెలిపారు. బుధవారం ఖమ్మం ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఒపిఎన్ మెగా అదాలత్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, వ్యక్తిగత, చిరు వ్యాపార రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించలేని వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. దీన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కోసం బ్యాంకు అధికారులు 5 ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వివి నారాయణ, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం మెయిన్ బ్రాంచ్ ఛీఫ్ మేనేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.