‘లెజెండ్’ రొమాంటిక్ ఫోజ్

Legend-Teaser

బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే యాక్షన్, ఎమోషన్ గుర్తొస్తాయి. ‘సింహా’ తర్వాత వీరిద్దరూ కలసి చేస్తున్న ‘లెజండ్’ సినిమా కూడా అలాంటిదే. అయితే, ఈ సినిమా ఆడియోకి సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం మాంచి రొమాంటిక్ గా వుంది. కథానాయిక సోనాల్ చౌహాన్ తో కలసి వున్న బాలకృష్ణ రొమాంటిక్ పోజ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

పొతే, ఈ సినిమా ఆడియోను ఈ నెల 7న హైదరాబాదులోని శిల్ప కళా వేదిక ఆడిటోరియంలో అభిమానుల సందడి మధ్య విడుదల చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.