లోక్ పాల్ బిల్లు ఆమోదానికి పార్టీలన్నీ సహకరించాలి: రాహుల్

లోక్ పాల్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 99 శాతం బలమైన లోక్ పాల్ బిల్లును ఆమోదించడానికే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. లోక్ పాల్ బిల్లు భారత జాతి ఉన్నతికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు పాస్ చేసేందుకు కావాల్సిన అన్ని వనరులు కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నప్పటికీ అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని తాము ఆలోచిస్తున్నామని రాహుల్ స్పష్టం చేశారు. లోక్ పాల్ బిల్లు విషయంలో గెలుపు ఓటముల సమస్య లేదని ఆయన అన్నారు. అవినీతిపై లోక్ పాల్ బిల్లు బ్రహ్మాస్త్రం అని రాహుల్ వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.