వదలండిక పదవులు

వదలండిక పదవులు

సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. ఉద్యోగసంఘాల ప్రతినిధులతో రెండుగంటల పాటు వాడివేడిగా సమావేశం కొనసాగింది. రాజీనామాకు సిధ్ధమైనే మంత్రులు, ఎంపీలు ఉద్యోగసంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉథృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతుగా రాజీనామాలు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. త్వరలోనే అందరూ కలిసి కూర్చుని చర్చించి మూకుమ్మడిగా సోనియాగాంధీకి రాజీనామాలు సమర్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆమె ప్రతిస్పందన ఆధారంగా తర్వాతి అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 నుంచి పార్లమెంటు అనుబంధ భవనంలో ఏపీ ఎన్జీవోలు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, విద్యుత్ సౌథ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్ళంరాజు, చిరంజీవి, పనబాక లక్షి్మ, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, ఎంపీలు అనంత వెంటట్రామిరెడ్డి, జివి హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.