వర్మకు మొదటి స్నేహితుడు..!

Ram-gopal-varma

మోహన్ బాబుని తన ప్రథమ మిత్రుడిగా ప్రకటించాడు రాంగోపాల్ వర్మ.
తనకింతవరకు స్నేహితులన్న వాళ్ళు లేరనీ, మోహన్ బాబుని తొలి స్నేహితునిగా పరిగణిస్తున్నాననీ వర్మ చెప్పాడు.
రాత్రి ‘రౌడీ’ సినిమా ఆడియో వేడుకలో వర్మ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించడంతో సభికులు క్లాప్స్ కొడుతూ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు.
“ఇన్నేళ్ళుగా నాకు స్నేహితులన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ, మోహన్ బాబుగారితో ఈ సినిమాకి పనిచేయడం మొదలెట్టాక ఆయనతో అనుబంధం ఏర్పడింది. అందుకే నా ఫస్ట్ ఫ్రెండ్ గా ఆయనని స్వీకరిస్తున్నాను” అన్నాడు వర్మ.
ఈ సందర్భంగా మోహన్ బాబు గురించి మరో విశేషం చెబుతూ, ‘అయ్ హేట్ మోహన్ బాబు’ అన్నారు వర్మ.
తర్వాత దానికి వివరణ ఇస్తూ, “చిన్నప్పుడు ఓసారి ఓ సినిమా పోస్టర్లో జయసుధను చూసి, ఆమెతో ప్రేమలో పడిపోయాను.
అలా నాకెంతో ఇష్టమైన ఆమెను శివరంజని సినిమాలో మోహన్ బాబు నానా కష్టాలు పెట్టడంతో ఆయన్ని ద్వేషించడం మొదలెట్టాను” అంటూ అందర్నీ నవ్వించారు వర్మ.
ఇక మోహన్ బాబు కూడా వర్మని ఆకాశానికి ఎత్తేశారు.
దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులను మినహాయిస్తే, నెంబర్ వన్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మేనని చెప్పారు.
“వర్మలోని డెడికేషన్ నాకెంతో నచ్చింది. ఆయన ముంబయ్ వర్కింగ్ స్టయిల్ కి అలవాటు పడిన దర్శకుడు కాబట్టి, ఈ సినిమా సమయంలో షూటింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేద్దామని అడిగాను.
ఎందుకంటే, నేను మామూలుగా ఏడు గంటలకే సెట్లో వుంటాను.
‘మీరెప్పుడంటే అప్పుడే వస్తాను’ అన్నాడు. అలా నాకంటే అరగంట ముందే వచ్చి సెట్లో ఉండేవాడు. అతని డెడికేషన్ కి ఆశ్చర్యపోయాను. హ్యాట్సాఫ్ టు రాంగోపాల్ వర్మ” అన్నారు మోహన్ బాబు.
అంతేకాదు, వర్మ పట్ల తనకున్న ప్రేమాభిమానాలకు నిదర్శనంగా వర్మ తల్లి, సోదరి, మామయ్యలను వేదికపైకి పిలిచి సన్మానించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.