వర్మ కొత్త సినిమా ఫస్ట్ లుక్

Reddy-garu-poyaru-first-look

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రెడ్డి గారు పోయారు’ అనే నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పాలిటిక్స్ అనేది నిజమైన అబద్ధం… అంటూ క్యాప్షన్ ని కూడా ఇచ్చాడు. రక్త చరిత్ర విజయం తర్వాత మళ్లీ అంతటి విజయం కోసం వర్మ ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘విడుదల:  ఎలక్షన్ కి ముందు’ అని కూడా ఫస్ట్ లుక్ లో ప్రకటించాడు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతర రాష్ట్ర పరిస్థితులపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే రాష్ట్ర విభజన అంశం చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా రూపొందుతుందని చెప్పొచ్చు. వివాదాలకు మారుపేరయిన వర్మ మరి ఈ సినిమాతో ఎలాంటి వివాదాన్ని రేపనున్నాడో వేచిచూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.