వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టిన బరాక్ ఒబామా

obama-22

హైదరాబాద్, నవంబర్ 22: అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వలస విధానంలో సమూల మార్పులకు ఒబామా శ్రీకారం చుట్టారు. అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులు, ఇతర విదేశీయులకు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో తాత్కాలికంగా ఉండటానికి వీలుగా వెసుబాటును కల్పించారు. దీనివల్ల దాదాపు 4.5 లక్షల మంది భారతీయులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం. తనకున్న అధికారాల్ని ఉపయోగించి ఒబామా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తుల తల్లిదండ్రులకు ఒబామా నిర్ణయం వల్ల తాత్కాలికంగా నివసించటానికి, ఉద్యోగం చేయటానికి వీలు కలుగుతుంది. అమెరికాలో ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లటం, ఉద్యోగాలు మారటం దీనివల్ల సులువవుతుంది. అమెరికాలో ఐదేళ్లుగా ఉంటున్నవారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఒబామా శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవిలో మాట్లాతూ ఈ వరాలను ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.