వారణాసిలో మోడీ ఓటమి ఖాయం: లాలూ

lalu-on-modi

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటమి తప్పదని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభ్యర్థిత్వం ఖరారైంది. అయితే, వారణాసి లౌకిక ప్రాంతమని, అక్కడ మతతత్వ మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని లాలూ వ్యాఖ్యానించారు.

మతతత్వ పార్టీలను అధికారంలోకి రాకుండా ఆర్జేడీ పోరాటం చేస్తుందని మోడీ ప్రధాని కాకుండా ఆపడమే తమ ఏకైక లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. అయితే లాలూ వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ బదులిచ్చింది. వారణాసి బరిలో మోడీ నిలవడం ఉత్తరప్రదేశ్ లో పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ వెల్లడించింది. అతి పెద్ద రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తంచేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.