వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ చేపట్టాలి : ఓవైసీ

హైదరాబాద్: వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జి తో కాని, సీబీఐ తో కాని విచారణ జరిపించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయన ముఖ్యమంత్రితో సమావేశమై పలు విషయాలను చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జితోగానీ లేదా సీబీఐతోగానీ న్యాయవిచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. అనంతరం యునైటెడ్ ముస్లిం ఫోరం చైర్మెన్ ఖురేషీ మాట్లాడుతూ ఈ ఎన్ కౌంటర్ బూటకమని, పోలీసులే వికారుద్దీన్ గ్యాంగ్ ను హాత్య చేశారని ఆరోపించారు.

సూర్యాపేటలో పోలిసులపై కాల్పులకు దిగిన సిమి ఉగ్రవాదుల చర్యను ఓవైసీ ఖండిస్తున్నట్టు తెలిపారు. వికారుద్దీన్ గ్యాంగ్ ను బూటకపు ఎన్ కౌంటర్ పేరుతో హాత్య చేసిన పోలిసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ భాదను వ్యక్తం చేశారని, ఈ ఘటన దురదృష్టకరమైందిగా ఆయన అభిప్రాయపడ్డారని ఓవైసీ తెలిపారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకొంటే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్ కౌంటర్ పై తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం తీసుకొనే చర్యల ఆధారంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఓవైసీ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.