విడుదలైన మంచు మనోజ్ కరెంటు తీగ

current teega-311014 copy

హైదరాబాద్, అక్టోబర్ 31: మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన కరెంట్ తీగ నేడు విడుదలైంది. 24 ప్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రానికి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతిబాబు ముఖ్యపాత్రలో నటించారు. హాట్ భామ సన్నీలియోస్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళంలో వచ్చిన వరుతపడాద వాలిబర్ సంఘం అనే సినిమాకి ఇది రీమేక్ అందులో ఉన్న కథనే తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. అక్కడ ఎలా ఉందో అలానే కథనం ఉంటె ఈ చిత్రం కాస్త బాగుండేదేమో, కాని చాలా మార్పులు చేసి అనవసరమైన సన్నివేశాలను జత చేసి ప్రేక్షకులను కొంత గందగోళం పెట్టించారు. దర్శకుడిగా జి నాగేశ్వర్ రెడ్డి గతంలో సీమ శాస్త్రి వంటి చిత్రాలలో కామెడీ బాగా పండించారు కాని ఈ చిత్రం విషయంలో అంతగా రాణించలేకపోయారు. మంచు మనోజ్ నటన బాగుంది కాని కొన్ని సన్నివేశాలలో అవసరానికి మించి నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ తన అందాల ఆరబోత పాళ్ళు కొంచెం పెంచింది. సన్నీ లియోన్ ఉన్నంతసేపు అందాలతో ఆకట్టుకుంది. జగపతి బాబు నటన అంతగా ఆకట్టుకోలేదు, కాని ఈ పాత్రకి కావలసిన న్యాయం చేశాడు. తమిళంలో చూడకపోయి ఉంటె ఒకసారి చూడవచ్చు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.