విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమ్ ఆద్మీ నో

aravind-kejriwal-aap

ఎన్నికల వాగ్దానాల అమలులో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించ కూడదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయించారు. వాల్ మార్ట్ లాంటి విదేశీ సంస్థలను మల్టీ బ్రాండ్ రంగంలోకి అనుమతిస్తే భారీగా ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని భావించిన ఆప్ ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.

రిటైల్ రంగంలో ఎఫ్ డీఐలకు తమ సమ్మతిని తెలియజేస్తూ షీలాదీక్షిత్ గత ప్రభుత్వం ఇచ్చిన లేఖను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి లేఖ ద్వారా తెలియజేసింది. కాగా ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం విదేశీ పెట్టుబడులపై పెను ప్రబావం చూపుతుందని పారిశ్రామిక వర్గాలు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.