విద్యార్ధినిపై దాడిచేసిన ప్రదీప్ మృతి

హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాద్ ఇంజనీరింగ్ విద్యార్ధినిపై ప్రేమోన్మాది వేటకోడవలితో దాడిచేశారు. అనంతరం నిందితుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట, బండ్లగూడ అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న రవళిపై ప్రదీప్ అనే యువకుడు వేట కోడవలితో దాడి చేశాడు. అనంతరం ప్రదీప్ తన వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతనిని సైదాబాద్ లోని డిఆర్ డిఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రవళిని మహిదీపట్నంలోని సుజాత అసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ప్రదీప్ గత కొంతకాలంగా ప్రేమించాలంటూ రవళిని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతడు పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడ్డాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.