విద్యుత్ షాక్ తో ముగ్గురు చిన్నారులు మృతి

electrical poll-2

ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైన విద్యుత్ స్తంభం

పామర్రు, జనవరి 2: కృష్ణా జిల్లా పామర్రులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గాలి పటాలు ఎగురవేస్తున్న ముగ్గురు పిల్లలు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. పామర్రులోని రాజుహరిగోపాల్ నగర్ లో గాలిపటం ఎగరవేయడానికి ముగ్గురు చిన్నారులు మేడ పైకి వెళ్లారు. దీంతో గాలి పటం దారం కరెంటు తీగకు చుట్టుకుంది. విద్యుత్ తీగలపై చిక్కుకున్న గాలి పటాన్ని ఇనుపరాడ్ తో తీయడానికి ప్రయత్నించగా విద్యుత్ షాక్ తో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

నల్లబోతుల వెంకటేశం, వెంకటేశ్వరమ్మ దంపతుల ఇద్దరు కుమారులు ఏసురాజు, జాన్ బాబు, బోగిన వీరయ్య, తిరుపతమ్మ దంపతుల కుమారుడు సురేష్ లు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో మృతుల కుటింబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. వీరయ్య దంపతులకు ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామస్తులను కలచివేసింది. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.