విభజనతో కష్టాలే : తులసీరెడ్డి

విభజనతో కష్టాలే : తులసీరెడ్డి

నెల్లూరు: రాష్ర్టవిభజన వల్ల తాగునీరు, సాగునీరు కష్టాలు తప్పవని కాంగ్రేసు పార్టీ నాయకుడు తులసీరెడ్డి అన్నారు. రాష్ర్టవిభజనపై ఇప్పడు జరిగింది కేవలం రాజకీయ  ప్రక్రియ మాత్రమేనని, రాజ్యాంగ ప్ర్రక్రియ జరగలేదని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఫతేఖాన్ పేటలో జరిగిన సమైక్య రాష్ర్ట పరిరక్షణ సభలో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలుమార్లు రాజ్యాంగాన్నే మార్చారని,  పార్టీ నిర్ణయాన్ని మార్చడం కష్టం కాదని చెప్పారు. కాంగ్రేసు వర్కింగ్ కమిటీ నిర్ణయం శిలాశాసనమేమీ కాదని స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.