విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా: శైలజానాథ్

Shailajanath

అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభజన బిల్లును కేంద్రం టేబుల్ ఐటెంగా తీసుకురావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మంత్రి శైలజానాథ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధిని మరచి విభజన స్పూర్తిని త్యజించిన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తికి విరుద్ధంగా తయారైన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తెలుగు జాతికోసం విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అన్నారు. భారత ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తయారైన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఆధిపత్య ధోరణికి అనుకూలంగా మారుతున్న ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని శైలజానాథ్ స్పష్టం చేశారు.

శాసనసభలో ఆయన మాట్లాడటాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తుండడంతో తాను మాట్లాడితే ఎక్కడ ప్రజలకు నిజాలు తెలుస్తాయోనని భయంతో వణికిపోతున్నారని అన్నారు. తెలుగు జాతిని ముక్కలు చేస్తున్న ఈ నిర్ణయంపై మాట్లాడేందుకు తనకు అన్ని రకాల హక్కులు ఉన్నాయన్న ఆయన నినాదాలు చేస్తున్నవారికి సమాధానం ఇస్తూ.. నేను 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మంత్రినని, ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.