విలీనం వద్దంటూ కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతల విన్నపం

trs-merge-in-congress

ఓ వైపు తెలంగాణను ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్ హామీ.. మరోవైపు తెలంగాణను ఇచ్చాం, టీఆర్ఎస్ ను విలీనం చేయండన్న కాంగ్రెస్ నేతల ఒత్తిడి ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా? లేక, కేవలం పొత్తు మాత్రమే పెట్టుకుంటారా? అనే విషయంపై రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో విలీనం వద్దంటూ కేసీఆర్ కు టీఆర్ఎస్ శ్రేణులు విన్నవించుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో అన్ని సీట్లను తాము గెలుచుకుంటామని, ఈ నేపథ్యంలో విలీనం చేయరాదంటూ తమ అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కేసీఆర్ నుంచి ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.